‘వీఏవోలకు మెమోలు ఇవ్వడం సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: సమావేశానికి రాలేదని ఆసిఫాబాద్ మండల సమైఖ్య ద్వారా వీవోఏలకు మెమోలు ఇవ్వడం సరికాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో డీఆర్‌డీవో దత్తారావుకు గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడు తూ వీవోఏలు సీసీల అనుమతి తీసుకున్నా మెమోలు జారీ చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగ భద్రత లేకున్నా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారిని వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమంగా సీసీ విధులు నిర్వర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీధర్, స్వామి, మహేశ్, రమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment