బోనస్ రాలే..!
● సన్నరకం వరిధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 ప్రకటించిన ప్రభుత్వం ● కొనుగోళ్లు పూర్తయినా అందని నగదు ● ఆందోళన చెందుతున్న రైతులు
దహెగాం(సిర్పూర్): సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వానాకాలం సీజన్‌లో చాలామంది రైతులు సన్నరకం వరి పండించారు. ప్రైవేట్ వ్యాపారుల వద్ద ధర ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి రోజులు గడుస్తున్నా అన్నదాతల ఖాతాల్లో మాత్రం బోనస్ నగదు జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జనవరి 12న మూసివేశారు. నేటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులు బ్యాంకులు, సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నారు.
55 వేల ఎకరాల్లో సాగు..
వర్షాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా చెరువులు, బోర్ల కింద 55 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశా రు. అత్యధికంగా 50 వేల ఎకరాల్లో సన్నాలే సాగైంది. ధాన్యం సేకరించడానికి జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. 57 వేల మెట్రిక్ టన్ను ల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నా.. కేవలం 10,695 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. సన్నాలు 9,862 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 833 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. సొసైటీల ద్వారా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,320 ధర చెల్లించింది. కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో ప్రైవేట్‌లోనే విక్రయాలు ఎక్కువగా జరిగాయి. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2,700 పైగా చెల్లించారు.
బోనస్‌కు 1,460 మంది అర్హులు
జిల్లాలో అధికంగా సిర్పూర్ నియోజకవర్గంలోనే వరి సాగు ఉంది. ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, తిర్యాణి మండలాల్లోనూ కొంతమంది ధాన్యం పండిస్తున్నారు. జిల్లాలో 1,460 మందికి రూ.4.93 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలం 219 మందికి రూ.72.73 లక్షలు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 1,241 మంది రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను మూసి వేసి 25 రోజులైనా డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నగదు ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.
బోనస్‌కు అర్హులు 1,460 మంది
రావాల్సిన మొత్తం రూ.4.93 కోట్లు
ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.72.73 లక్షలు
బోనస్ వచ్చిన రైతులు
219 మంది
జిల్లా
వివరాలు
Comments
Please login to add a commentAdd a comment