
గంగాపూర్ జాతరకు ఏర్పాట్లు చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో ప్రసిద్ధి చెందిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించే జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. శుక్రవారం గంగాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, క్యూలైన్ల కోసం బారికేడ్లు, తాగునీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ చర్యలు కల్పించాలని సూచించారు. వైద్యశిబిరాలు, నిరంతర విద్యుత్ సరాఫరా, ప్రత్యేక బస్సు సౌకర్యం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరమ్మ, ఎస్సై చంద్రశేఖర్, ఎంపీవో వాసుదేవ్, ఆలయ ఈవో బాపిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మురళీధర్, నాయకులు రమేష్, సుదర్శన్‌గౌడ్, జయరాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment