
రమాబాయికి నివాళి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో బౌద్ధ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ సతీమణి రమాబాయి జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బుద్ధ పూజ నిర్వహించి, రమాబాయి చిత్రపటానికి పూలమాలలకు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కటిక పేదరికంలోనూ అంబేడ్కర్ చదువుకు ఆటంకం కలగనీయకుండా సహకరించిన గొప్ప త్యాగమూర్తి రమాబా యి అని కొని యాడారు. నేటి మహిళలు రమాబాయిని ఆదర్శంగా తీసుకోవాలని సూ చించారు. చిన్నారులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, మండల అధ్యక్షుడు జైరాం ఉప్రె, అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి దుర్గం సునీల్, నాయకులు విలాస్, రాజేంద్రప్రసాద్, దుర్గం తిరుపతి, గేడం హిరిషన్, దుర్గం సందీప్, రోషన్, అరుణ్, ప్రతాప్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment