దరఖాస్తు గడువు పెంపు
ఆసిఫాబాద్‌రూరల్: 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు మార్చి 31 వరకు పెంచినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మైనార్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://telanganaepass.cgg.gov.i n వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
తునికాకు టెండర్లు పిలవాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: తునికాకు సేకరణకు వెంటనే టెండర్లు పిలవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఫారెస్టు అధికారి కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, భారత ప్రజాతంత్ర యువత సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత జిల్లా ప్రజలకు తునికాకు సేకరణ రెండో పంటగా అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని తెలిపారు. ఏటా డిసెంబర్, జనవరిలో టెండర్లు పూర్తిచేస్తే, ఫిబ్రవరిలో కొమ్మకొట్టే పనులు పూర్తిచేస్తారన్నారు. ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ ప్రా రంభం కాకపోవడంతో సేకరణదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అధికా రులు స్పందించి టెండర్లు పూర్తిచేసి, ఆకు సేకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఆత్రం బాపూరావు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment