ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అన్నిపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా అందిస్తామని తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. కేంద్రాల వద్ద అన్ని వసతులు సమకూరుస్తున్నామని అన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎన్నికల పర్యవేక్షకుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మా ట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపైనే ఉందన్నారు. అత్యవసరమైతేనే ఇతర ఆస్పత్రికి రోగులను రెఫర్ చేయొద్దన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Comments
Please login to add a commentAdd a comment