● నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి
నస్పూర్: ఎస్సీ వర్గీకరణతో నేతకానీలకు అన్యా యం జరిగిందని నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి, ప్రధాన కార్యదర్శి సిద్దార్థ రామ్మూర్తి అన్నారు. నస్పూర్, శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడారు. దామాషా ప్రకారం తమకు రావాల్సిన కోటాను తమకు కేటా యించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ వివాదాస్పందంగా ఉన్నదని, ఇది భవిష్యత్తులో అస్థిత్వ పోరాటా లకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత జాతులను బీజేపీకి తాకట్టు పెట్టేలా మంద కృష్ణ మాదిగ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అణ గారిన వర్గాలకు అండగా ఉండాల్సిన మందకృష్ణ మాదిగ మనువాదులకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నేతకాని జనాభా ఎంత ఉందో కూడా తెలియని మాజీ ఎంపీ వెంకటేశ్‌నేత తమకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తమ న్యాయమైన హక్కులు తమకు కల్పించకపోతే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతి నిధి జనగామ తిరుపతి, నాయకులు జాడి యేసయ్య, జాడి కళ, ప్రేంకుమార్, సెగ్గెం చంద్రమ్మ, లక్ష్మి, రాము, తులసిరాం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment