ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్
రెబ్బెన(ఆసిఫాబాద్): నిత్యం పాలన పరమైన విధులతో బిజీగా ఉండే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చాక్‌పీస్ పట్టి విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. శనివారం రెబ్బెన మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదోతరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు గణితంలోని లాగరిఽథంపై పలు ప్రశ్నలు అడిగారు. సులువుగా అర్థమయ్యేలా చాక్‌పీస్ పట్టి బ్లాక్‌బోర్డుపై పాఠాలు భోదించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రిజిష్టర్లు, రికార్డులు, భూ భారతి దరఖాస్తులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment