ఎమ్మెల్సీ ఓట్ల వేట!
● ప్రచారం మొదలు పెట్టిన పట్టభద్రులు, టీచర్ల అభ్యర్థులు ● ఉమ్మడి జిల్లా ఓటర్ల మద్దతుకు ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల నా మినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 10వ తేదీ వరకు అవకాశం ఉండగా పరిశీలన, ఉపసంహరణ పక్రియ 13తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఈ నెల 27 పోలింగ్ జరుగనుండగా మార్చి 3న కౌంటింగ్ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్‌కు ముందు నుంచే..
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఉమ్మడి జిల్లాలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో నిలిచే అభ్యర్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి మద్దతు కోరారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచే అభ్యర్థులు పట్టభద్రులతో సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటామని సంకేతాలు ఇచ్చారు. ఇక నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నామినేషన్లు వేసి ఓట్ల వేటలో పడ్డారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు.
పోటాపోటీగా ప్రచారం
ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉండడంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నా యకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తునారు. బీజేపీ నుంచి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న మల్క కొమురయ్య ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్ర చారం మొదలు పెట్టారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానానికి పోటీకి దిగిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అ ధినేత నరేందర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మంచి ర్యాల జిల్లాకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నా యకుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి నియోజకవర్గ పరి ధిలో ప్రచారం చేస్తున్నారు. టీచర్స్ స్థానానికి పోటీ చేస్తున్న కూర రఘోత్తమ్‌రెడ్డితో పాటు పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తదితరులు ప్రచార స్పీడ్‌ను పెంచారు.
ఓటర్లకు కాల్స్, మెసేజ్‌లు
పట్టభద్రులు, టీచర్ల ఓటర్లకు అభ్యర్థుల పేర్లతో కూడిన వాయిస్ కాల్స్ వస్తున్నాయి. అభ్యర్థి పేరు చెబుతూ తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లుగా కోరుతున్నారు. వీటితో పాటు ఓటర్లకు బల్క్ మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాలు షేర్ చేస్తున్నారు. ఒక్కో ఓటరుకు ప్రతిరోజూ కనీసం రెండు మూడు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు.
ఖరీదవుతున్న ఎన్నిక
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరింత ఖరీదై న ఎన్నికలుగా మారాయి. గత ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి గెలిపొందారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తమ్‌రెడ్డి విజయం సాధించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో విజయంపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో అభ్యర్థులకు ఖర్చులు సైతం తడిసి మోపడవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈసారి పలువురు వ్యాపారులు, ఆర్థిక, రాజకీయ బలం ఉన్నవారు బరిలో ఉన్నారు. దీంతో ఆరేళ్ల క్రితం జరిగిన ఎన్నికలంటే ఈసారి ఖర్చు పెరుగుతోంది. ఎలాగైనా గెలవాలని ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment