అంబేడ్కర్ సమాజ్‌రత్న అవార్డుకు ఎంపిక
వాంకిడి: మండల కేంద్రాకి చెందిన బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమతా సైనిక్ దళ్ ఆసిఫాబాద్ ఇన్‌చార్జి దుర్గం సందీ ప్ బీఆర్ అంబేడ్కర్ సమాజ్‌రత్న రాష్ట్రీయ అవార్డుకు ఎంపికై నట్లు అఖిల భారత గురు రవిదాస్ సమతా పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మధు బావల్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురు రవిదాస్ 648వ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఆదిలాబాద్‌లో అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఆయన పే ర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజ ల్లో చైతన్యం నింపడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన ‘నవోదయ’ పరీక్ష
ఆసిఫాబాద్‌రూరల్: జవహర్ నవోదయ పాఠశాల, కళాశాలల్లో తొమ్మిదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశానికి జిల్లాలో శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్ పార్వతి తెలిపారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి ఉదయం 11:15 గంటల నుంచి 1:45 వరకు నిర్వహించిన పరీక్షకు 1,579 మందికిగానూ 1,225 మంది హాజరు కాగా 354 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 1,007 మంది విద్యార్థులకుగానూ 730 మంది హాజరు కాగా 277 మంది గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రాంతంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు జరుగుతున్నందువల్ల ఆది వారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ రూ రల్ ఏఈ ఊర్మిల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గండి, గుడిగుడి, గోవింద్‌పూర్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
కొనసాగుతున్న ఇంటర్ ప్రయోగ పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్ ప్రయోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం కాగజ్‌నగర్ ప్రభుత్వ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈవో కళ్యాణి పరిశీలించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 291 మందికి గానూ 278 మంది హాజరు కాగా 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 164 మందికిగానూ 139 హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 241 మందికిగానూ 231 మంది హాజరుకాగా 10 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 241 మందికిగానూ 225 మంది హాజరుకాగా 16 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment