‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
కౌటాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో సిర్పూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌రావు చేతిలో సిర్పూర్ ఆగమైపోతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్‌ఎస్పీ నాయకత్వంలో సిర్పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిర్పూర్ నాయకులతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment