
‘ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి’
రెబ్బెన: ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులుగౌడ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో శనివారం మండల కేంద్రంతో పాటు, గోలేటిలో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కోరుకున్నారని, అందుకే బీజేపీకి పట్టం కట్టారన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ కోకన్వీనర్ కొలిపాక కిరణ్‌కుమార్, బెల్లంపల్లి ప్రభారీ సుదర్శన్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, మండల అధ్యక్షుడు రాంబాబు, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment