
జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
రెబ్బెన(ఆసిఫాబాద్): గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏర్పడిన ట్రాఫిక్ సమస్య పునరావృత్తం కాకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం వద్ద మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి అంబులెన్సులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
కలెక్టర్, ఎస్పీ పూజలు
జాతర ఏర్పాట్ల పరిశీలన అనంతరం కలెక్టర్ వెంకటేష్‌దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ బాలాజీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, బీపీఏ జీఎం శ్రీనివాస్, తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో శంకరమ్మ, డీఈ రాజన్న, ఎస్సైలు చంద్రశేఖర్, ఎంబడి శ్రీకాంత్, ఈవో బాపిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జయరాం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment