
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి గమానియల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్రాక్టివ్ ప్లాట్ పానెల్ బోర్డు ఏ విధంగా వినియోగించాలి, ఆడియోలు, వీడియోలు విద్యార్థులకు ఎలా చూపించాలనే అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అనంతరం డీఈవో మా ట్లాడుతూ ఉపాధ్యాయులు చాక్‌పీస్ వాడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులకు విద్యను అందించాలన్నారు. ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యా నల్‌తో గణితం, భౌతిక, జీవ శాస్త్రం సులువుగా అర్థమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ భరత్, రవికుమార్ లాలాజీ, రాజు, శాంతి కుమార్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment