నైపుణ్యాభివృద్ధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: తెలంగాణ అకాడమి ఫర్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని డీసీపీవో మహేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌లో 70 మంది నిరుద్యోగ యువతకు ఇస్తున్న 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఒక దశ పూర్తి బుధవారం పూర్తి చేసుకుంది. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీవో మహేష్ మాట్లాడుతూ యువత నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు. టాస్క్ అధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ రీజనల్ మేనేజర్ సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు
● ఇంటర్మీడియట్ విద్యాశాఖ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య
ఆసిఫాబాద్‌రూరల్: విద్యావ్యవస్థలో ప్రతిష్ఠాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయోగాత్మకమైన అడుగులు వేయనున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య అన్నారు. సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు స్థల సేకరణపై బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్‌కు విచ్చేసిన కృష్ణ ఆదిత్యకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఉట్నూర్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment