వేసవికి ముందే గోస!
బావిలో నుంచి నీళ్లు తోడుతున్న మహిళలు
బావినీళ్లే దిక్కు
వాంకిడి: మండలంలోని సోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధి మచ్చగూడ (మహాగావ్) గ్రామస్తులు దశాబ్దాలుగా బావినీటిపైనే ఆధారపడుతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలో మిషన్ భగీరథ నీటిట్యాంకు నిర్మించి పైపులైన్ వేసి వదిలేశారు. కొన్నినెలలు మాత్రమే నీటిసరఫరా జరిగి ఆతర్వాత నిలిచిపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న రెండు చేతిపంపులు పాడైపోయి ఏళ్లు గడుస్తుండటంతో చేనులో ఉన్న ఓ పెద్ద బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవికాలంలో నీరు అడుగంటిపోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
వేసవికి ముందే గోస!
Comments
Please login to add a commentAdd a comment