‘అపార్’ నమోదు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల అపార్ గుర్తింపు కా ర్డుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అపార్ గుర్తింపు సంఖ్య అందించాలన్నారు. వేసవిలో పాఠశాలల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీటీడీవో రమాదేవి, ఎస్‌వోలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.