ఒత్తిడిని జయించి ఉత్తమ ఫలితాలు సాధించాలి
వాంకిడి/కెరమెరి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కెరమెరి మండలంలోని మోడి, హటి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా 768 మందికి పరీక్ష ప్యాడ్‌లు, వాటర్ బాటిళ్లు, 2500 మందికి పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల, సమయ పాల న విజయానికి ముఖ్య సూత్రాలన్నారు. అ లాంటి పట్టుదలతోనే తాను ఈస్థాయికి చేరుకోగలిగానని, మీరంతా కూడా ఉన్నత శిఖరా లకు చేరుకునేలా కష్టపడాలని సూచించారు. పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, ఎంఈవో శివచరణ్ కుమార్, హెచ్‌ఎం నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.