రుణాల పంపిణీలో భేష్
తిర్యాణి(ఆసిఫాబాద్): స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణా ల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతోపాతోపాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తుంటారు.
4,046 సంఘాలకు రుణాలు
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో తొమ్మిది రోజుల సమయం ఉండగానే అధికారులు లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో 4,046 మహిళా సంఘాలకు రూ.230.18 కోట్ల రుణాలు అందించి లక్ష్యం అధిగమించారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు రూ.24 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లాలో అత్యధికంగా రెబ్బెన మండలంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.12.15 కోట్ల రుణ లక్ష్యానికి 282 మహిళా సంఘాలకు రూ.22.10 కోట్ల రుణాలు అందించి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా లింగాపూర్ మండలంలో రూ.9.70 కోట్ల రుణ లక్ష్యానికి 186 సంఘాలకు కేవలం రూ.6.38 కోట్లు మాత్రమే చెల్లించి జిల్లాలో చివరిస్థానంలో నిలిచింది.
రికవరీ ఇలా..
బ్యాంకు లింకేజీ ద్వారా అందించిన రుణాల్లో దాదాపు రూ.58 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.42 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.28 కోట్ల రుణాలు రికవరీ చేశారు. రుణాల ఇవ్వడంతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను సభ్యులకు వివరిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
2024– 25 ఆర్థిక సంవత్సరంలో మహిళ సంఘాల సభ్యులకు రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు రూ.230.18 కోట్ల రుణాలు సంఘాలకు అందజేశాం. సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణ లక్ష్యంలో రూ.24 కోట్లు పంపిణీ చేశాం. లోన్ రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
– దత్తారావు, డీఆర్‌డీవో
మండలాల వారీగా రుణ పంపిణీ వివరాలు
మండలం మహిళా లక్ష్యం అందించిన మొత్తం
సంఘాలు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
ఆసిఫాబాద్ 394 23.92 22.46
బెజ్జూర్ 207 12.33 11.91
దహెగాం 208 11.71 11.85
జైనూర్ 337 22.33 18.46
కాగజ్‌నగర్ 338 23.17 24.68
రెబ్బెన 282 12.15 22.10
సిర్పూర్(యూ) 237 11.69 8.66
సిర్పూర్(టి) 228 13.01 15.20
వాంకిడి 342 18.19 21.74
తిర్యాణి 278 11.96 12.84
పెంచికల్‌పేట్ 115 5.87 6.14
లింగాపూర్ 186 9.70 6.38
కౌటాల 221 13.54 15.45
కెరమెరి 423 14.44 18.52
చింతలమానెపల్లి 250 17.66 13.72
రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జిల్లా
స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు
బ్యాంకు లింకేజీ ద్వారా రూ.230.18 కోట్లు
సీ్త్రనిధి ద్వారా మరో రూ.24 కోట్ల చెల్లింపులు