జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు జీవతంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జన్కాపూర్‌లోని పాత కలెక్టరేట్ భవనంలో గల టాస్క్ కేంద్రంలో 40 రోజుల కంప్యూటర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు శుక్రవారం డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి సర్టిఫికెట్లు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ 40 రోజులపాటు కంప్యూటర్ శిక్షణ, టైపింగ్ మెలకువలు నేర్పించినట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. శిక్షణ కేంద్రం సమన్వయకర్త సాయికుమార్, శిక్షకులు పాల్గొన్నారు.