● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిదారులు ● పంట డబ్బులకు ఎదురుచూపు ● నిర్మాణ దశలోనే నమూనా ఇళ్లు ● సర్కారు లక్ష్యం నెరవేరని వైనం | - | Sakshi
Sakshi News home page

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిదారులు ● పంట డబ్బులకు ఎదురుచూపు ● నిర్మాణ దశలోనే నమూనా ఇళ్లు ● సర్కారు లక్ష్యం నెరవేరని వైనం

Published Sun, Mar 23 2025 9:06 AM | Last Updated on Sun, Mar 23 2025 9:02 AM

● చాల

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిద

లింగాపూర్‌ మండల కేంద్రంలో ఇంటి నిర్మాణానికి ముగ్గు పోస్తున్న అధికారులు

చేతిలో పైసలు లేకనే..

మా లాంటి పేదోళ్లకు ఇల్లు మంజూరైనందుకు సంతోషమే. కానీ.. ఇల్లు కట్టాలంటే ఇప్పుడు చేతిలో పైసలు లేవు. సార్లు ముగ్గుపోసి పది రోజులైంది. సర్కారోళ్లే గుత్తెదారుతోని

నిర్మించి ఇస్తే బాగుండేది.

– జైతుబాయి,

మేతుగూడ, లింగాపూర్‌ మండలం

త్వరలో పనులు ప్రారంభిస్తాం

ఇప్పటివరకు జిల్లాలో 450 ఇళ్లకు మార్కింగ్‌ ఇ చ్చాం. పనులు తొందర గా ప్రారంభించేలా చూ స్తాం. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లి స్తాం. లింగాపూర్‌లో నీటి సమస్యతో నమూనా ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు.

– వేణుగోపాల్‌, హౌసింగ్‌ డీఈ

కెరమెరి(ఆసిఫాబాద్‌): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గాలకు 3,500 చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కేటా యించింది. తొలుత మాడల్‌ గ్రామాల్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేసింది. మొదటి విడతలో జిల్లాలోని 15 మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 1,861 గృహ నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు 450కి మాత్రమే మార్కింగ్‌ ఇచ్చినట్లు హౌసింగ్‌ అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చి గత నెలలో ముగ్గులు పోసినా చాలా ప్రాంతాల్లో ఇంకా పనులు ప్రారంభించలేదు. ఎంపీడీవోల పర్యవేక్షణలో గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చూడాలి. కానీ.. వారికి అధికారులు అవగాహన కల్పిస్తున్నా నిర్మాణాలపై ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందులతోనే..

జిల్లాలోని కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, తిర్యాణి తదితర మండలాల్లో లబ్ధిదారులంతా నిరుపేద గిరిజన ఆదివాసీలే. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో పంటల దిగుబడి కూడా రాలేదు. దీంతో చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే స్తోమత లేక చాలా మంది మిన్నకుండిపోతున్నారు. అప్పోసప్పో చేసి ఇంటిని నిర్మించుకుంటే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందో.. లేదోననే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించాలని ప్రభుత్వ ఆదేశించినా చాలా చోట్ల అధికారులు పనులు ప్రారంభించలేదు.

జిల్లాలో ఇళ్ల మంజూరు ఇలా..

మండలం గ్రామం మంజూరైన

ఇళ్లు

కెరమెరి కొఠారి 108

జైనూర్‌ మార్లవాయి 52

సిర్పూర్‌(యు) ఫులారా 284

లింగాపూర్‌ జాముల్‌ధర 185

తిర్యాణి రోంపల్లి 102

ఆసిఫాబాద్‌ గోవింద్‌పూర్‌ 119

వాంకిడి జైత్‌పూర్‌ 104

రెబ్బెన పోసిగాం 71

కాగజ్‌నగర్‌ మాలిని 163

సిర్పూర్‌(టి) మోదిపల్లి 154

కౌటాల నాగాపల్లి 191

చింతలమానెపల్లి బాబాపూర్‌ 160

బెజ్జూర్‌ షుష్మిరా 22

పెంచికల్‌పేట్‌ లోద్‌పల్లి 122

దహెగాం దిగడ 24

విడతల వారీగా బిల్లులు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల సాయం అందించనుంది. ఆయా నిర్మాణ దశల్లో బిల్లులు చెల్లించేందుకు నిర్ణయించింది. బేస్మెంట్‌ దశలో రూ.లక్ష, లెంటల్‌ లెవల్‌ వరకు రూ.లక్ష, స్లాబ్‌ లెవల్‌ వరకు రూ.2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక రూ.లక్ష అందించనుంది. కాగా, ఇళ్ల కోసం ముగ్గులు పోసి నెల అవుతున్నా 90 శాతం గ్రామాల్లో ఇంకా పనులు ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 30 మంది లబ్ధిదారులు మాత్రమే పిల్లర్‌ గుంతలు తవ్వించినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శలు వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాల ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దీని ఆధారంగానే లబ్ధిదారులకు బిల్లులు వచ్చే అవకాశముంది.

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిద1
1/3

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిద

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిద2
2/3

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిద

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిద3
3/3

● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement