‘సీతక్కకు క్షమాపణ చెప్పాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: మంత్రి సీతక్కను కించపరిచేలా మాట్లాడిన సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివాసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అగ్రవర్ణ అహంకారంతో శ్రీనివాస్ వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పకుంటే రానున్న రోజు ల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీనివాస్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, జైనూర్ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్, నాయకులు గుండా శ్యాం, చరణ్, వంత్‌రావ్, సుధాకర్, మారుతీపటేల్ తదితరులున్నారు.