
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
పెంచికల్‌పేట్(సిర్పూర్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని దరోగపల్లి, చేడ్వాయి, పోతెపల్లి, ఎల్కపల్లి గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. రూ.88లక్షల వ్యయంతో సీసీ రోడ్లతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో అంతర్గత రహదారులు నిర్మిస్తామన్నారు. అనంతరం విఠల్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేత గొండ్లపేట జ ట్టుకు రూ.40వేలు, రన్నరప్ ఎల్కపల్లి జట్టు కు రూ.20వేల నగదు, ట్రోఫీ ప్రదానం చేశా రు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గణపతి, మాజీ జెడ్పీటీసీ రామారావు, రాంచందర్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, నాయకులు సముద్రాల రాజన్న, రాచకొండ కృష్ణ, శంకర్‌గౌడ్, చౌదరి శ్రీనివాస్, ఇలియాస్ తదితరులు ఉన్నారు.