అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
బెజ్జూర్: యాసంగి సీజన్‌లో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు, పాయల్ శంకర్, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్ నిరసన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే దశలో నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు.