
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
● ఏఎస్పీ చిత్తరంజన్
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు చదువుకుని ఉ న్నతస్థాయికి ఎదగాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నా రు. సీఐ సత్యనారాయణ, ఎస్సై గుంపుల విజయ్ తో కలిసి బుధవారం మండలంలోని లెండిగూడ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల కు పరీక్ష ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు, పెన్నులు అందించారు. బిలివర్స్ అకాడమీ జీకే మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అ నంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంప్రదించాల ని సూచించారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే స మాచారం అందించాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్ ఉన్నారు.
దుకాణాల్లో తనిఖీలు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం భోలాపటార్ గ్రామంలో గల దుకాణాలను బుధవారం ఏఎస్పీ చిత్తరంజన్ తనిఖీ చేశారు. 56 దేశీదారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. లెండిగూడలో మహిళా సంఘాలు మద్య నిషేధం అమలు చేస్తుండగా, గ్రామస్తులు భోలాపటార్‌కు వెళ్లి మద్యం తాగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.