‘జమిలి ఎన్నికలతో దేశానికి మేలు’
లింగాపూర్(ఆసిఫాబాద్): జమిలి ఎన్నికలతో ఆర్థిక భారం తగ్గి దేశానికి మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. మండల కేంద్రంలోని జగదాంబా దేవి ఆలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో మేధావులు, ఉద్యోగులు, యువకులు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించాలని సూ చించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్‌నాయక్, నాయకులు హిరా మన్, రవీందర్, అశోక్, మంగులాల్, సచిన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.