రాత్రి పది నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు సొరంగం నుంచి భారీ వాహనాల రాకపోకలే నీటి ధారలకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. టన్నుల బరువుతో మితి మీరిన వేగంతో లారీలు, టిప్పర్లు ఈ మార్గంలో రాకపోకలు సాగించడంతో వచ్చే ప్రకంపనల నేపథ్యంలోనే సొరంగానికి పగుళ్లు ఏర్పడుతున్నాయని వివరిస్తున్నారు. సొరంగం రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఇళ్లలో సామగ్రి సైతం టిప్పర్లు, లారీల వేగానికి పడిపోతున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. సొరంగం పరిరక్షణకు చర్యలు తీసుకోకుంటే, ఈ నిర్మాణం చరిత్రగా మాత్రమే మిగులుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సొరంగం మనుగడపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment