విస్తృత స్తాయిలో ఎంఎస్‌ఎంఈ సర్వే
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
నందిగామ టౌన్(నందిగామ రూరల్): ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో జిల్లాలో ఎంఎస్‌ఎంఈ సర్వేను విస్తృత స్థాయిలో చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. నందిగామ పట్టణంలో జరుగుతున్న ఎంఎస్‌ఎంఈ సర్వే (ఉద్యమ్) యాప్‌లో సమాచారాన్ని పొందుపరిచే ప్రక్రియను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక యూనిట్‌కు రుణాలు అవసరమా, నైపుణ్యాభివృద్ధితో పాటు మార్కెటింగ్ అవసరాలు, యూనిట్లకు అవసరమైన చేయూతనందించడానికి సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లలో సాంకేతిక వినియోగం, నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి, సరిదిద్ద డానికి కూడా సర్వే ఫలితాలు దోహదపడతాయని చెప్పారు. ఎవరికై నా సందేహాలుంటే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 100 శాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికి క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పరిష్కరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment