బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పిల్లలమర్రి నాగేశ్వరరావు
మంగళగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ. 2వేల కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేతలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు బకాయి ఉన్న రూ. 172 కోట్లను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నేతన్న నేస్తం పథకాన్ని రూ.24 వేల నుంచి రూ.36 వేల రూపాయలకు పెంచాలని కోరారు. బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment