
జాతీయ సేవాపురస్కారం అందుకున్న పులిగడ్డ సర్పంచ్
అవనిగడ్డ: మండలంలోని పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్‌కుమార్ మదర్‌థెరిస్సా విశిష్ట సేవా జాతీయ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో సారస్వత పరిషత్ విశ్వ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమలో ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నాని చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విశిష్ట సేవా జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. పురస్కారం అందుకున్న సర్పంచ్‌ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు కడవకొల్లు నరసింహారావు, వైస్ ఎంపీపీ పులిగడ్డ పిచ్చేశ్వరరావు, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment