అనధికార కట్టడాలపై కొరడా
పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో అనధికార కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. పోరంకి, తాడిగడపలో పలు అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. దీంతో మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు పోరంకి బీజేఆర్ నగర్‌లో అనధికార భవన నిర్మాణంలో అదనపు ఫ్లోర్‌లను ధ్వంసం చేశారు. తాడిగడప మనోజ్‌నగర్‌లో కూడా అనధికార కట్టడాన్ని అధికారులు గుర్తించి శ్లాబ్‌కు కన్నాలు పెట్టారు. అనధికార నిర్మాణాలు నిర్మించినా, అక్రమ లేఅవుట్లు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ భవానీప్రసాద్ అన్నారు. ఇళ్ల స్థలాలు కొనే వారు, భవనాల్లో ఫ్లాట్ కొనే వారు నిబంధనల ప్రకారం నిర్మించారా లేదా అనే విషయం తెలుసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించండి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ఎకో సెన్సిటివ్ జోన్‌లో పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్‌లో మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా వైల్డ్ లైఫ్ సాంక్చ్యూరి పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. జోన్ పరిధిలోని గ్రామాల్లో పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి ఆయా శాఖలు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె. చంద్రశేఖర్, ఆర్డీవో కె. స్వాతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటకశాఖ అధికారి రామలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర వాసులందరూ పాల్గొనాలి
పటమట(విజయవాడతూర్పు): జాతీయ స్థాయిలో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ వాసులందరూ పాల్గొనాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. గతంలో నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచినందుకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ నగరాల్లో ఒకటిగా విజయవాడ నిలిచిందన్నారు. అదే మాదిరిగా ఈ సారి జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ నగర వాసులు చురుగ్గా పాల్గొని విజయవాడను ఉత్తమ స్థానంలో నిలపాలన్నారు. ప్రస్తుతం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రజాభిప్రాయాన్ని క్యూ ఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఫోన్ నంబర్, ఓటీపీ నమోదు చేసి, సర్వేలో ఉన్న పది ప్రశ్నలకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రజలను కోరారు.
అనధికార కట్టడాలపై కొరడా
అనధికార కట్టడాలపై కొరడా
Comments
Please login to add a commentAdd a comment