అలా కవర్ చేశారు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఉపాధి’లో నాణ్యత డొల్ల శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. నాసిరకంగా వేసిన రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. వివరాలు ఇవి.. కొత్తూరు తాడేపల్లి పంచాయతీలో రూ.1.04 కోట్లతో వేసిన సిమెంటు రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. గ్రావెల్ స్థానంలో చెరువు బురద, మట్టి వేశారు. దీనిపై కథనం రావడంతో అధికారులు దానిని చదును చేసి, దానిపైన డస్ట్ వేసి కవర్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే వేమవరంలో ప్రారంభానికి ముందే రోడ్లు పగుళ్లు వచ్చిన విషయాన్ని సాక్షి హైలెట్ చేయడంతో రోడ్డు దెబ్బ తిన్న ప్రాంతంలో వాటిని పగులగొట్టి, మళ్లీ కొత్తగా సిమెంటుతో పూడ్చారు. దీంతో ఆ పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నాణ్యతపై విజిలెన్స్ అధికారులతో విచారించాలని కోరుతున్నారు.
అలా కవర్ చేశారు!
అలా కవర్ చేశారు!