జబ్బు చేసి చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన రోగులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఏదైనా ప్రశ్నిస్తే మేమింతే అన్నట్లుగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో చేసేది లేక అష్టకష్టాలు పడుతూ వైద్యం పొందుతున్నారు. ముఖ్యంగా రోగులు అధికంగా వచ్చే న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి విభాగాల వద్ద పర్యవేక్షణ కొరవడింది.
– చందా కిరణ్‌తేజ, మాచవరం
మందులు ఇవ్వడం లేదు..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగులకు మందులు అరకొరగా ఇస్తున్నారు. దీంతో పదిహేను రోజులకోసారి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్తే క్యూలైన్‌లలో ఉండలేక పక్షవాతం వచ్చిన రోగులు, గుండె జబ్బులు ఉన్న వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగులపై కనికరం కూడా ఉండటం లేదు.
– ఎండీ రిజ్వాన్, అశోక్‌నగర్
రోగుల ఇబ్బందులు పట్టడం లేదు..