మద్దమాంబా.. చల్లగా చూడమ్మా!
అశేష జనవాహిని మధ్య మద్దికెర మద్దమాంబ రథోత్సవం కనులపండువగా సాగింది. ఆచార సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెద్దనగరి, చిన్ననగరి యాదవ కుటుంబీకులు ప్రత్యేక దుస్తులతో ఇంటి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుంచగా కళాకారులు నృత్యం చేస్తుండగా.. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతుండగా భక్తులు రథాన్ని ముందుకు కదిలించారు. భక్తులు ‘మద్దమాంబకు జై’.. అంటూ రథం పైకి అరటిపళ్లు విసిరి భక్తిని చాటుకున్నారు. – మద్దికెర
ఆలయంలో ప్రత్యేక ఆలంకరణలో మద్దమాంబ
మద్దమాంబా.. చల్లగా చూడమ్మా!
Comments
Please login to add a commentAdd a comment