చిన్నారుల అభ్యున్నతికే ఇంటింటి సర్వే
కర్నూలు: చిన్నారులకు సంబంధించి శారీరక, మానసిక, వినికిడి, గ్రహణమొర్రి, మాట ఉచ్ఛారణ వంటి సమస్యలను డీఈఐసీ సెంటర్ ద్వారా ఉచితంగా పరి ష్కరించి చిన్నారుల జీవనాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం నగరంలోని ఇల్లూరు నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఇందిరాగాంధీ నగర్ వరకు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీగల్ సర్వీసెస్ వారు ఇంటింటి సర్వే నిర్వహించడానికి న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లచే బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు జరిగే సర్వేలో ప్రాథమిక దశలో గుర్తించగలిగిన వైకల్యాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని డీఈఐసీ సెంటర్‌కు పంపించడం జరుగుతుందన్నారు. న్యాయవాదులు నిర్మల, శివసుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment