ఆందోళన అవసరం లేదు
బర్డ్‌ప్లూ నిర్ధారణ అయినప్పటికీ జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. రెడ్ జోన్‌గా గుర్తించిన కర్నూలులోని ఎన్‌ఆర్ పేటలో చికెన్, గుడ్ల అమ్మకాలను బంద్ చేశాం. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్లను తినవచ్చు. అయితే 100 డిగ్రీల వేడిలో ఉడికించి తినాలి. 50 డిగ్రీల్లో ఉడికిస్తే వైరస్ మొత్తం చనిపోతుంది. 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తే ఎలాంటి ప్రమాదం లేదు. పాజిటివ్ కేసు వచ్చినందున బయో సెక్యూరిటీ మెజర్స్‌ను పాటిస్తున్నాం. కోళ్లు, బాతులు మృతిచెందితే అధికారులకు సమాచారం ఇవ్వాలి.
–జి.శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ
Comments
Please login to add a commentAdd a comment