జాగ్రత్తలు ఇవీ..
● కర్నూలులో ఈనెల 3,4 తేదీల్లో
బాతులు మృతి
● ఆలస్యంగా స్పందించిన
పశుసంవర్ధకశాఖ అధికారులు
● రెడ్‌జోన్‌లో చికెన్,
గుడ్ల అమ్మకాల నిషేధం
● 35 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ఏర్పాటు
● జిల్లాలోని కోళ్ల ఫారాల్లో తనిఖీలు
బర్డ్‌ఫ్లూ నియంత్రణలో పశుసంవర్ధకశాఖ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలులో పది రోజుల క్రితం ఉన్నట్టుండి 15 బాతులు మృతిచెందాయి. బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. రక్త నమూనాలు, శీరం తదితర శ్యాంపుల్ సేకరించి భోపాల్‌లోని హైసెక్యూరిటీ ల్యాబ్‌కు పంపి మౌనంగా ఉండిపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్లు పెద్ద ఎత్తున మరణించినప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు చర్యలు తీసుకోలేదు. ‘బర్డ్‌ఫ్లూ’ వెలుగు చూడటంతో ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కేంద్రమైన కర్నూలులో బర్డ్‌ఫ్లూతో బాతులు మృతిచెందడం కలకలం రేపింది. అధికారుల్లో హడావుడి మొదలైంది. పశుసంవర్ధక శాఖతో పాటు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు కూడా రంగంలోకి దిగాయి. బయో సెక్యూరిటీ మెజర్స్ అమలుపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కోళ్లు, బాతులు, ఇతర జాతి పక్షులు జిల్లాలోకి రవాణా కాకుండా నిఘా పెంచారు. పశు వైద్యాధికారులతో కర్నూలు డివిజన్‌లో 14, ఆదోని డివిజన్‌లో 21 ప్రకారం మొత్తం 35 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటయ్యాయి.
కనిపించని మందులు
బర్డ్‌ఫ్లూతో బాతులు మృతిచెందడంతో కర్నూలులోని ఎన్‌ఆర్‌పేట చుట్టూ కిలోమీటరు పరిధిని రెడ్ అలర్ట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో కోళ్లు, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. ఎన్‌ఆర్ పేటకే ఐదు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటయ్యా యి. ఈ టీమ్‌ల్లోని పశువైద్య అధికారులు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దుకాణాల్లో కోళ్లు, గుడ్లు అనేవి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అయితే పది రోజుల క్రితమే బాతులు బర్డ్‌ఫ్లూతో మృతి చెందాయి కదా.. అది ఏ స్థాయికి విస్తరించిందో అన్న భయాందోళనలు ప్రజల ను వెంటాడుతున్నాయి. బర్డ్‌ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మందులు సరఫరా చేయలేదు. అయితే ఓ ప్రజా ప్రతినిధి నివాసంలోనే బాతులు మృతి చెందాయనే ప్రచారం జరుగుతోంది.
తనిఖీలు ముమ్మరం
కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది కోళ్లఫారాలు ఉన్నాయి. వగరూరు, వెల్దుర్తి, కోడుమూరు మండలం ప్యాలకుర్తి, కృష్ణగిరి మండలం కోయిలకొండ, కర్నూలు మండలం గార్గేయపురం, దేవనకొండ మండలం నేలతలమర్రి, కుంకనూరు, దేవనకొండలో ఈ ఫారాలు ఉన్నాయి. వీటిల్లో 5,84,911 కోళ్లు ఉన్నాయి. కోళ్లఫారాలను ర్యాపిడ్ రెస్పాన్స్ బృంద సభ్యులు తనిఖీలు చేశారు. అనుమానాస్పద స్థితిలో కోళ్లు మృతిచెందితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా.. కర్నూలులో ‘బర్డ్‌ఫ్లూ’ వెలుగు చూడటంతో ఒక్కసారిగా చికెన్, గుడ్ల అమ్మకాలు 50 శాతంపైగా పడిపోయినట్లు తెలుస్తోంది.
● బర్డ్‌ప్లూ వెలుగు చూడటంతో జిల్లా
యంత్రాంగం బయో సెక్యూటరీ మెజర్స్‌పై
దృష్టి సారించింది.
● కోళ్ల ఫారాల్లోకి ప్రజలను అనుమతించరు.
● కోళ్ల ఫారాల నిర్వాహకులు, డాక్టర్లు సైతం
డెటాల్ నీళ్లలో కాళ్లు ముంచి వెళ్లాలి.
● పశువైద్యులు ఒక ఫారాన్ని తనిఖీ చేసిన తర్వాత
మరో ఫారానికి వెళ్లరాదు.
● చికెన్, గుడ్లను 100 డిగ్రీల టెంపరేచర్‌లో
ఉడికించి తినాలి.
● కోళ్లు, బాతులు, ఇతర జాతి పక్షులు మృతి చెందితే పశువైద్యులకు సమాచారం ఇవ్వాలి.
● పెరటి కోళ్ల పెంపకందారులు అధికారుల
సూచనలు పాటించాలి.
● షెడ్డులో, పెరట్లో కోళ్ల ఆరోగ్యంలో తేడాలు
ఎక్కువ శాతం ఉంటే పశువైద్య అధికారులకు
సమాచారం ఇవ్వాలి.
● కోడి మాంసం, గుడ్లను తిన్న వారికి జలుబు, దగ్గు, కండరాల నొప్పులు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చమటలు పట్టడం, వాంతులు విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.
● మనుషుల నుంచి మనుషులకు బర్డ్‌ప్లూ
వ్యాధి వ్యాప్తి చెందదు.
కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవీ..
ముక్కు, కళ్ల వెంబడి నీరు కారుతుంది.
మెడ వాల్చడం, నీరసంగా ఉండడం
కనిపిస్త్తుంది.
మచ్చలు ఏర్పడటం, విరేచనాలు
ఎక్కువ కావడం గమనించవచ్చు.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు
24–48 గంటలలో కోళ్లు మృతిచెందుతాయి.
జాగ్రత్తలు ఇవీ..
జాగ్రత్తలు ఇవీ..
Comments
Please login to add a commentAdd a comment