క్రమశిక్షణకు మారుపేరు నవోదయ విద్యాలయాలు
ఎమ్మిగనూరురూరల్: క్రమ శిక్షణకు మారుపేరు జవహార్ నవోదయ విద్యాలయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు. శుక్రవారం బనవాసి జవహార్ నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపాల్ ఇ. పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజపురస్కార్ టెస్టింగ్ క్యాంప్ ముగింపు కార్యాక్రమానికి సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాజపురస్కార్ టెస్టింగ్ క్యాంప్‌కు వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదేచ్చేరి రాష్ట్రాల నుంచి 16 నవోదయ విద్యాలయాల భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పారు. ఈ క్యాంప్ సర్టిఫికెట్ భవిష్యత్‌లో ఉద్యోగాలకు చాలా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చందిరన్, తహసీల్దార్ శేషఫణి, ఎల్‌ఓసీ స్కౌట్స్ బాబురావు నింబూరె, ఎల్‌ఓసీ గైడ్స్ మల్లేశ్వరి, శిక్షణ పరిశీలకులు అనిల్‌శాస్త్రి, రమేష్, శివకుమార్, విద్యాలయ స్కౌట్స్, గైడ్స్ మాస్టర్లు శశికిరణ్, మీనాచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు రుణాలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన వారికి జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలను అందించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జాకీర్‌హుసేన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు వారై, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలన్నారు. బీ ఫార్మసీ/ ఎం ఫార్మసీ సర్టిఫికెట్లు ఉండాలన్నారు. అర్హత కలిగిన వారు https://apobmms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలని ఈడీ కోరారు.
తపాలా శాఖనుప్రైవేటు పరం కానివ్వం
కర్నూలు(అర్బన్): కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖను మూడు ముక్కలుగా చీల్చి ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని పోస్టల్ జేఏసీ నేతలు ఈశ్వరయ్య, గిరిబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శుక్రవారం స్థానిక తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఎదు ట ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తపాలా శాఖను ముక్క లు చేసేందుకు కుట్ర పన్నారన్నారు. తపాలా శాఖను ఐపీపీబీలోకి మెర్జ్ చేసి అమెజాన్ లాంటి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని 150 సంవత్సరాల చరిత్ర ఉన్న తపాలా శాఖను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్నారు. ఈ కుట్రలను ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆందోళనలో జేఏసీ నేతలు శమంతకరెడ్డి, మోహమ్మద్ జానీ, విజయ్, శివకుమార్‌రెడ్డి, మురళీ, లక్ష్మీకాంత్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ–క్రాప్ నమోదు వంద శాతం చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్‌లో సాగు చేసిన ఉద్యాన పంటలు వంద శాతం ఈ–క్రాప్‌లో నమోదు చేయడంపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించాలన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నందున ఎంఐడీహెచ్, ఆర్‌కేవీవై లక్ష్యాలను వంద శాతం సాధించడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. బోర్లలో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్న రైతులతో ఆయిల్‌ఫామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఏడాది మామిడిలో పూత ఆశాజనకంగా వచ్చిందని, పూత, పిందె రాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో సాంకేతిక ఉద్యాన అధికారి వి. అనూష, ఉద్యాన అధికారులు మదన్‌మోహన్ గౌడు తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు నవోదయ విద్యాలయాలు
క్రమశిక్షణకు మారుపేరు నవోదయ విద్యాలయాలు
Comments
Please login to add a commentAdd a comment