రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి
● జేసీ డాక్టర్ నవ్య
కృష్ణగిరి: రీ సర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య అధికారులను ఆదేశించారు. ఎరుకలచెరువు గ్రామ రెవిన్యూ పరిధిలో జరుగుతున్న సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీ సర్వే ఎంత మంది చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో పూర్తి చేశారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వే చేసే భూముల్లో ముందుగా రైతులకు నోటీసులు ద్వారా తెలియజేయాలన్నారు. ఎక్కడ తప్పులు లేకుండా రీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. చనిపోయిన వారికి వారి వారసుల పేరు మీద మ్యుటేషన్ చేయాలన్నారు. రైతులకు తెలియకుండా సర్వే చేస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామ, బ్లాక్, ప్రభుత్వ సరిహద్దులను పక్కాగా నిర్ధారించాలన్నారు. గ్రామ ప్రజల సమక్షంలోనే సర్వే చేపట్టాలని సూచించారు. అనంతరం కృష్ణగిరి తహసీల్దార్ కార్యాలయంలో సర్వేపై వీఆర్వోలు, సర్వేయర్లకు పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె వెంట పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్, తహసీల్దార్ దేవ. చంద్రశేఖర్, డీటీ లక్ష్మిరాజు, వీఆర్వోలు, సర్వేయర్లు ఉన్నారు.
శ్రీమఠానికి రూ.40 లక్షలు విరాళం
మంత్రాలయం: రాఘవేంద్ర స్వామి శ్రీమఠానికి యూఎస్‌ఏలో స్థిరపడిన బెంగళూరుకు చెందిన సింధుప్రియ అనే భక్తురాలు రూ.40 లక్షలు విరాళం అందజేశారు. శుక్రవారం రాత్రి ఆమె మంత్రాలయం వచ్చి ముందుగా మంచాలమ్మ దర్శించుకున్నారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూలబృందావనం చేరుకు ని పూజలు చేసుకుని మొక్కులు చెల్లించారు. ఆమెను శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శాలువాతో సత్కరించి మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. విరాళాన్ని అన్నదానం, గోశాల, మఠం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని దాత కోరినట్లు మేనేజర్ వెంకటేష్ జోషి, ఏఏఓ మాధవ శెట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment