రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
ఆలూరు రూరల్: టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలను జైలుకు పంపడమే టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. చిప్పగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర మంత్రి లోకేష్ దావోస్ పర్యటన లో రెడ్‌బుక్ పూర్తిగా తెరవలేదని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్ల క్రితం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులు నమోదు చేసి రెడ్‌బుక్ తెరిచారా అన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల పై కక్ష సాధింపు కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను కార్యాలయంలో లేనని కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఒప్పుకుని కేసు వాపసు తీసుకున్నా.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే బలవంతంగా అరెస్టు చేయడం, 8 గంటల వరకు స్టేషన్‌లో పెట్టుకుని జైలుకు పంపించడం దారుణమన్నారు. ‘సూపర్ సిక్స్’ను నమ్మి ప్రజలు ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు.. వైఎస్సార్‌సీపీ నాయకులను జైలుకు పంపడ మే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. త్వరలోనే జగన్ 2.0 పాలన వస్తుందన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలను జైలుకు
పంపడమే టీడీపీ నేతల లక్ష్యం
వల్లభనేని అక్రమ అరెస్టుపై
మండిపడిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
Comments
Please login to add a commentAdd a comment