వీర జవాన్లకు జోహార్లు
పుల్వామా దాడిలో అశువులు బాసిన భారత వీర జవాన్లకు శుక్రవారం పత్తికొండలో నివాళులర్పించారు. స్థానిక నాలుగు స్తంభాల కూడలిలో అమరవీరుల చిత్రపటాలను ప్రదర్శించి కొవ్వొత్తులు వెలిగించి జోహార్లు అర్పించారు. ఆరేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14వ తేదీన దేశ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో భారత సైనికుల వాహనంపై ఉగ్రదాడి జరగడంతో 40 మంది జవాన్లు మృతి చెందారు. నివాళులర్పించిన వారిలో ఎస్‌ఐ గోపాల్, స్థానికులు ప్రతాప్, కరణం నరేష్ తదితరులు ఉన్నారు.
– పత్తికొండ రూరల్
Comments
Please login to add a commentAdd a comment