మద్యం షాపు తొలగించకపోతే ఉద్యమిస్తాం
నందికొట్కూరు: తాలూకా ఆఫీస్ రోడ్డులో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని 28వ వార్డు ప్రజలు, సీపీఐ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని ఎకై ్సజ్ శాఖ, రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుతో మహిళలు, బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. అనంతరం ఎకై ్సజ్ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్‌కు, తహసీల్దార్ శ్రీనివాసులుకు మద్యం దుకాణం తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు రఘురామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment