కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా అందరికీ రెండు కిడ్నీలు విడివిడిగా ఉంటాయి. కానీ అత్యంత అరుదుగా కొందరికి మాత్రం రెండు కిడ్నీలు గుర్రపు నాడా ఆకారంలో ఉండి, కింది భాగం కలిసిపోయి ఉంటాయి. కర్నూలులోని ఓ మహిహిళకు అలాంటి కిడ్నీలు ఉండి ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో దానిని వైద్యులు ల్యాప్కోస్కోపిక్ విధానంలో ఆపరేషన్ చేసి తొలగించారు. శుక్రవారం వివరాలను కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్‌లో యురాలజిస్టు డాక్టర్ వై. మనోజ్‌కుమార్ వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన ఎం. లక్ష్మీదేవి(50)కి పుట్టుకతో కిడ్నీలు గుర్రపునాడా ఆకారంలో ఏర్పడ్డాయి. ఇంతకాలం వాటితో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ కొంత కాలంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పి, మధ్యమధ్యలో జ్వరం లాంటి లక్షణాలతో బాధపడ్డారు. ఈ సమస్యలతో గత జనవరి 21వ తేదీన ఆమె కిమ్స్ హాస్పిటల్‌కు వచ్చారు. పరీక్షించగా ఆమెకు గుర్రపునాడా కిడ్నీలలో కుడివైపుది బాగా వాపు వచ్చి పాడైపోయి, కిడ్నీసైజు పెద్దగా మారినట్లు గుర్తించాం. ఆమెకు మరుసటి రోజు న ల్యాప్రోస్కోపిక్ పద్దతిలో పాడైన కిడ్నీని జాగ్రత్తగా తొలగించాం. దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, రక్తస్రా వం కూడా వీలైనంత తక్కువగా ఉండటంతో ఆమె త్వ రగా కోలుకుంది. దీంతో ఆమెను అదే నెల 26న డిశ్చార్జ్ చేశాం. తిరిగి ఆమె వైద్యసేవల కోసం శుక్రవా రం రాగా పరీక్షించి ఆపరేషన్ విజయవంతం అయ్యిందని నిర్ధారించుకున్నాం’ అని డాక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment