పోలీస్ లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
ఆస్పరి: రాజమహేంద్ర వరంలో మృతి చెందిన సీఐడీ డీఎస్పీ బి. నాగరాజు అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామమైన ఆస్పరిలో పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. డీఎస్పీ మృతదేహనికి డీఎస్పీలు నరిసిరెడ్డి, నాగరాజుయాదవ్, దైవప్రసాద్, ఉపేంద్ర, ఆస్పరి సీఐ మస్తాన్‌వలి, పోలీసులు, బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహన్ని మేళతాళాలతో ఊరేగించారు. డీఎస్పీ సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పోలీసులు తుపాలకులతో గౌరవ వందనం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
పోలీస్ లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
Comments
Please login to add a commentAdd a comment