నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు (టౌన్): నిజాయితీకి, నిరాడంబరత్వానికి దామోదరం సంజీవయ్య నిలువెత్తు నిదర్శనం అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఎస్పీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రారష్ట్‌ర రెండవ ముఖ్యమంత్రిగా సేవలు అందించారన్నారు. చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రజా సంక్షేమం అమలులో అందరి మన్ననలు పొందారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ ఆడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment