ఇంట్లో చెట్టు... బయట కొమ్మలు
ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం కోస్తా ప్రాంతం నుంచి కొందరు దొర్నిపాడు మండలానికి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రామచంద్రాపురం గ్రామంలో చాలా మంది సువిశాలమైన స్థలాల్లో గుడిసెలు, ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు. బబ్బూరి వెంకటస్వామి అనే ఓ వ్యక్తి స్థలంలో పెద్ద వేప చెట్టు ఉంది. దానిని తొలగించడం ఇష్టం లేని సదరు వ్యక్తి కుటుంబం గృహ నిర్మాణాన్ని సైతం ఆ చెట్టు చుట్టే చేపట్టింది. లోపల చెట్టు మొదలు, బయట కొమ్మలు కనిపించేలా నిర్మించిన ఈ గూడు గ్రామంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. చెట్లపై మక్కువతోనే తాము ఇలా చేశామని, కొమ్మలు పైన ఉండటంతో వేసవిలో వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఇంటి యజమాని పేర్కొన్నారు. – దొర్నిపాడు
Comments
Please login to add a commentAdd a comment