పాణ్యం: మండల పరిధిలోని బలపనూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బలపనూరు గ్రామానికి చెందిన బి. మేహేశ్వరరెడ్డి, కుమార్తె వైష్ణవి, అదే గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి పెద్ద కుమార్తె వై. రామ పూజిత(16) నంద్యాల సమీపంలోని ఓ ప్రయివేట్ జూనియర్ కళాశాలో చదువుతున్నారు. వై. పూజిత హాస్టల్‌లో ఉంటుండగా వైష్ణవి రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి వస్తుంటుంది. పూజిత బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంది. దీంతో శుక్రవారం రాత్రి మహేశ్వరరెడ్డి స్కూటీపై వైష్ణవితో కలిసి ఆబాలిక కాలేజీ నుంచి బయలుదేరింది.బలపనూరు గ్రామం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా కర్నూల్ వైపు వెళ్తున్న మినీట్రాలీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్త స్థానికులు శాంతిరామ్ ఆసుపత్రికి తరలించగా పూజిత కోలుకోలేక మృతి చెందారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment