కర్నూలు (హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15, 16వ తేదీన వైద్య విజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామి రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొదటి రోజు పూర్వ వైద్య విద్యార్థులు, సీనియర్ పార్లమెంటేరియన్ డాక్టర్ ఎం.వి.మైసూరా రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ బి.ఎల్.రవీంద్రారెడ్డి, రిటైర్డ్ డీజీపీ డాక్టర్ టి.నాయక్ తదితరులు హాజరవుతున్నారన్నారు. రెండు రోజులు కర్నూలు మెడికల్ కళాశాలలో చదివి ప్రస్తుతం దేశ విదేశాల్లో ఆయా స్పెషాలిటీల్లో పేరు, ప్రఖ్యాతలు గడించిన స్పెషలిస్టులు వస్తున్నారని, వారు వారి స్పెషాలిటీలో వచ్చిన నూతన వైద్య విధానాలను వైద్యులకు వివరిస్తారని తెలిపారు.
హౌసింగ్ ఈఈగా వెంకటదాసు
కర్నూలు(అర్బన్): జిల్లా గృహ నిర్మాణ సంస్థ కర్నూలు ఈఈగా పీ వెంకటదాసు శుక్రవారం హౌసింగ్ జిల్లా అధికారి అజయ్‌కుమార్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి ఆయన ఇక్కడకు వచ్చారు. గత ఏడాదిన్నర కాలంగా రెగ్యులర్ ఈఈ లేకపోవడం వల్ల కర్నూలు అర్బన్ డీఈఈ ప్రభాకర్ ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తు వచ్చారు.
ప్రత్యేక ప్యాకేజీతో కుంభమేళా టూర్
కర్నూలు కల్చరల్: ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు ప్రత్యేక ప్యాకేజీతో టూర్ ఏర్పాటు చేశారు. ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఏసీ వోల్వో (45 సీటర్స్) బస్సు బయలు దేరుతుంది. తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి, ప్రయాగరాజ్ చేరుకుంటుంది. తిరిగి జబల్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా బస్సు తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు ఓర్వకల్లు, 2.15 గంటలకు కర్నూలు నుంచి బయలు దేరుతుంది. వారం రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. పెద్దలకు (10 సంవత్సరాలు పైబడిన వారు) రూ.20 వేలు, 3 నుంచి 9 సంవత్సరాల వయస్సు పిల్లలకు రూ.17, 200 టికెట్ ధర నిర్ణయించారు. వివరాలకు 90101 77055ను సంప్రదించవచ్చు.
ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌గా రమణ
సాక్షి, అమరావతి: ఇంధన శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగానికి కర్నూలు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌గా వై. వెంకట రమణను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం కాకినాడ విద్యుత్ భద్రత విభాగంలో డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. పదోన్నతిపై రమణను బదిలీ చేస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీఈడబ్ల్యూఐడీసీ నంద్యాల ఈఈగా నాగరాజు
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ ) నంద్యాల ఈఈగా గోన నాగరాజు నియమితులయ్యారు. కర్నూలు డీఈఈగా ఉన్న ఈయనకు నంద్యాల ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంస్థ ఎండీ దీవన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కర్నూలు ఈఈ లక్ష్మీనారాయణ నంద్యాల ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో నంద్యాల ఈఈగా బాధ్యతలు స్వీకరించనున్న నాగరాజును పలువురు ఉద్యోగులు అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ డీఈఈ వీరయ్య, ఏఈలు మధు, హరీష్, సురేంద్ర, ప్రవీణ్, మోయిద్దీన్‌ఖాన్, ప్రభాకర్‌రావు, డీపీఓ షబానా, డీఈఓ నాగేంద్ర, సిబ్బంది బాలయ్య, సుబ్బడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment