హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు
మద్దికెర: శ్రీ మద్దమాంబ రథోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మద్దికెరలో శుక్రవారం రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు నిర్వహించారు. పోటీలను ఎస్‌ఐ విజయ్‌కుమార్ నాయక్, ఎంపీపీ అనిత, సర్పంచ్ సుహాసిని ప్రారంభించారు. గుంతకల్లు రహదారిలో ఉన్న మైదానంలో నిర్వహించిన పోటీలు ఉదయం నుంచి ఉత్కంఠ భరితంగా సాగాయి. అనంతపురం జిల్లా ఎ. నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ మహుద్ బాషా ఎద్దులు మొదటి, నంద్యాల జిల్లా పీఆర్ ఎం.నాగయ్య ఎద్దులు రెండో, అనంతపురం జిల్లా మెడికాలపల్లె తిరుపాల్ రెడ్డి ఎద్దులు మూడో, నంద్యాల జిల్లా సయ్యద్ కాలామ్ బాషా ఎద్దులు నాల్గో, నంద్యాల జిల్లా పీఆర్‌పల్లెకు చెందిన ఎద్దులు ఐదో స్థానంలో నిలిచాయి. వృషభాల యజమానులకు బహుమతులను నిర్వాహకులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, కిట్టి, ఖాజావలి అందజేశారు.
పోస్టల్ ఆర్‌డీ సొమ్ము స్వాహా
పోస్టుమాస్టర్‌పై పోలీసులకు
ఫిర్యాదు చేసిన బాధితులు
ఆత్మకూరు: మండలంలోని వడ్లరామాపురం గ్రామస్తులకు పోస్టుమాస్టర్ టోకరా వేసి నగదు స్వాహా చేశాడు. ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..వడ్లరామాపురం పోస్టుమాస్టర్‌గా ముస్తఫా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో పలువురు పోస్టల్ ఖాతా తెరిచి ఆర్‌డీలు, ఇన్సూరెన్స్ చేశారు. నెలనెలా వారు చెల్లించే సొమ్మును పోస్టుమాస్టర్ ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేశాడు. ఖాతాదారులకు అనుమానం రాకుండా వారి పుస్తకంలో నమోదు చేశాడు. ఐదేళ్ల దాటడంతో తమ పొదుపు సొమ్ము ఇవ్వాలని ఖాతాదారులు అడగగా పోస్టుమాస్టర్ ఇవ్వకుండా నేడు..రేపు అనుకుంటూ వస్తున్నాడు. తమ డబ్బు ముస్తఫా కాజేశాడని తెలుసుకొని పలువురు శుక్రవారం ఆత్మకూరు ఎస్‌ఐ వెంకటనారాయణరెడ్డికి కలిసి ఫిర్యాదు చేశారు. సుగులూరు సుబ్బన్న రూ.70 వేలు, రత్నస్వామి రూ.2.20 లక్షలు, సముద్రం భాగ్యమ్మ రూ.50 వేలు, చెంచెన్న రూ.లక్ష, దేవరాజు రూ.90 వేలు, లలితమ్మ రూ.40 వేలు, వసుంధర రూ.20 వేలు, సీతమ్మ రూ.90 వేలు, చెన్నారెడ్డిగారి సుబ్బమ్మ రూ.2.14 లక్ష లు, గుర్రం సావిత్రమ్మ రూ.1.20 లక్షలు, శేషిరెడ్డి రూ. 80 వేలు, ప్రశాంతి రూ.32 వేలు, దేవరాజు రూ.10 వేలు, సుంకన్న రూ.43 వేలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోస్టుమాస్టర్‌ను విచారిస్తున్నామని త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
అనంతపురం, నంద్యాల జిల్లాల
వృషభాలకు మొదటి, ద్వితీయ బహుమతి
Comments
Please login to add a commentAdd a comment