మోటార్ సైకిళ్లు ఢీ.. ఒకరు మృతి
రుద్రవరం: మండల పరిధిలోని చిన్నకంబలూరు గ్రామ సమీపంలో శుక్రవారం రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం బోయలకుంట్లకు చెందిన నాగేశ్వరరావు (56) ఓ పంచాయితీ నిమిత్తం మండల కేంద్రమైన రుద్రవరానికి వెళ్లాడు. అక్కడ పనులు పూర్తి కాగానే తిరిగి మోటార్ సైకిల్‌పై స్వగ్రామానికి బయలు దేరాడు. శిరివెళ్లకు చెందిన నూర్‌బాషా చిన్నకంబలూరు వైపు తాపీ మేసీ్త్ర పనులు ముగించుకొని మోటార్ సైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఆ క్రమంలో చిన్నకంబలూరు గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆ రెడు బైక్‌లు ఎదురెదురై ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షత గా త్రులను చికిత్స నిమిత్తం 108వాహనంలో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మృతి చెంది నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసుమోదు చేసి విచారణ చేపట్టినట్లు వారు తెలిపారు.
లభించని బాలుడి ఆచూకీ
పత్తికొండ రూరల్: హంద్రీ–నీవా కాలువలో గురువారం గల్లంతైన 12 ఏళ్ల బాలుడు తులసీగౌడు ఆచూకీ శుక్రవారం కూడా దొరకలేదు. ఎపీఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 15 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ జయన్న తెలిపారు. డోన్‌కు చెందిన దామోదర్‌గౌడు, రాజేశ్వరి దంపతుల కుమారుడు తులసీగౌడ్.. పందికోన సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బాలుడి ఆచూకీ శుక్రవారం సాయంత్రం వరకు లభించలేదు.
హుండీ చోరీ యత్నం
వెల్దుర్తి: గుడిలో హుండీని దొంగలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. హైవే పోలీసుల పహారాతో హుండీ, బైక్ వదిలి పారిపోయారు. వివరాలు ఇవీ.. గురువారం రాత్రి ఇద్దరు యువకులైన దొంగలు మండల పరిధిలోని హైవే 44ను ఆనుకుని ఉన్న మదార్‌పురం గ్రామ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి గుడి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా ఇతరత్రా అల్మారాలు తెరిచి విలువైన వస్తువుల కోసం వెతికారు. గుడిలో హుండీ తాళం పగులగొట్టి తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. బయటకు తీసుకెళ్లి దూరంగా వెళ్లి తెరుచుకునే ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో బైక్‌పై హుండీతో బయలుదేరారు. అదే సమయంలో పహారాలో ఉన్న హైవే పోలీసుల కంట పడ్డారు. హైవే కానిస్టేబుల్ శేఖర్, సిబ్బంది తమ వాహనంలో దొంగల వెంట పడ్డారు. దీంతో దొంగలు హుండీని, బైక్‌ను బొమ్మిరెడ్డిపల్లె వద్ద వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అశోక్, సిబ్బంది హుటాహుటిన బయలుదేరి దొంగల కోసం గాలించారు. హుండీని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుడిలోపలి సీసీ కెవెరాలో దొంగలు హుండీ తెరిచే ప్రయత్నం, ఎత్తుకెళ్లడం రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ సేకరించి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment